ఏలూరు జిల్లా ముదినేపల్లి:::::: భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి :::: గ్రామాల సమగ్రామభివృద్ధికి జీపీడీపీ కీలక మన్న రామిశెట్టి…….
ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో మండల పరిషత్ అధ్యక్షులు రామిశెట్టి సత్యనారాయణ ఆర్.జీ.ఎస్.ఏ. వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2026–27 కింద సామర్థ్య వృద్ధి (కెపాసిటీ బిల్డింగ్ ) శిక్షణ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతు,గ్రామాల సమగ్రామభివృద్ధికి జీ.పీ.డీ.పీ కీలక మని ముదినేపల్లి ఎం.పి.పీ. సత్యనారాయణ అన్నారు..గ్రామాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు అవసరమని, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపి) లక్ష్యాలను విజయవంతం చేయాలని సూచించారు.డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం ద్వారా గ్రామాల పురోగతిని మరింత వేగవంతం చేయవచ్చని తెలిపారుఆదాయ వనరుల పెంపు: గ్రామ పంచాయతీలు సొంతంగా ఆదాయ వనరులను పెంచుకునేలా ప్రణాళికలు వేయడం.మౌలిక వసతుల కల్పన: తాగునీరు, అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం.నిధుల కేటాయింపు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (ఉదాహరణకు 16వ ఆర్థిక సంఘం) నిధులను ఏయే పనులకు ఎలా ఉపయోగించాలో వార్షిక ప్రణాళికలు సిద్ధం చేయడం.పారదర్శకత: గ్రామ సభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని ఆన్లైన్ జీపీడీపీ పోర్టల్లో నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమం లో.. ఎం.పీ.డీ.వో. వై.రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో విజయ్ భాస్కర్ రావు, ఏవో. రమణారావు,వైస్-ఎం.పీ.పీ. రాచురి రాద,బొమ్మినంపాడు ఎం.పీ.టీ.సీ. దాసరి అరుణ కుమారి,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, స్పెషల్ ఆఫీసర్లు, గ్రామపంచాయతీ సెక్రటరీలు ఎం.పీ.టీ.సీ లు మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు

