భారత్ న్యూస్ గుంటూరు…ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటిపై కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదు
ముగ్గురిపై కేసు నమోదు, యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా
ㅤ
డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యూవల్ చేస్తామంటూ నమ్మించి భారీ మోసానికి పాల్పడిన నిందితులు
వెస్ట్ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో వెలుగుచూసిన ఉదంతం
బాధితుడు యూకే (UK) లో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోతుండటంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించిన వైనం
ఇండియాకు చెందిన తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని నమ్మబలికిన కేటుగాళ్లు
నిందితుల మాటలు నమ్మి రూ. 15 లక్షల వరకు చెల్లించిన బాధితుడు కుమార్

నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు నిందితులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు
డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై కేసు నమోదు
ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది మోసపోయి ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు?
మిగిలిన బాధితుల వివరాలను కూడా సేకరిస్తున్న పోలీసులు