ఏపీలో మరో బోటు ప్రమాదం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో మరో బోటు ప్రమాదం

కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవలో గ్యాస్ స్టవ్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే పడవలోని వారంతా సముద్రంలోకి దూకారు.

సమీపంలోని మరో బోటులోని మత్స్యకారులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కాపాడి, తునిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.