భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వరుణ దేవుని కృప కోసం ఉస్మాన్ సాగర్‌లో ప్రత్యేక పూజలు!
హైదరాబాద్:
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని, ప్రజలందరూ పంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గండిపేట ఉస్మాన్‌సాగర్ జలాశయం వద్ద చిలుకూరు బాలాజీ ఆలయ పండితులు ఘనంగా ‘వరుణ జపం

‘Ammiraju Udaya Shankar.sharma News Editor… నిర్వహించారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సి.ఎస్. రంగరాజన్ గారి నేతృత్వంలో ఎంతో నిష్ఠతో జరిగింది. అర్చకుల బృందం జలాశయం ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి, వరుణ దేవుని అనుగ్రహం కోసం 108 సార్లు శక్తివంతమైన వరుణ జప మంత్రాలను పఠించారు.
కరువు ఛాయలు తొలగి, ప్రాజెక్టులన్నీ జలకళతో సంతరించుకోవాలని పండితులు ఈ సందర్భంగా ప్రార్థించారు.

