భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..తొలి జీతం.. పేద పిల్లల కోసం ఖర్చు చేసిన టీచర్ స్నేహ శర్మ! ❤️📚
బీహార్‌కు చెందిన టీచర్ స్నేహ శర్మ తన మొదటి జీతాన్ని సొంత అవసరాలకు కాకుండా పేద విద్యార్థుల కోసం వినియోగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తొలి సంపాదనతో 120 మంది పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లు పంపిణీ చేసి, విద్యార్థుల చదువుకు అండగా నిలిచారు.
చిన్నారుల భవిష్యత్తు కోసం చేసిన ఈ మంచి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బు విలువ కంటే దానిని మంచి పనికి ఉపయోగించడం గొప్పదని స్నేహ శర్మ నిరూపించారు..

