భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు జిల్లా లో మరో సీఐ ఫై అక్రమ సంబంధం వేధింపుల వ్యవహారం..
పల్నాడు జిల్లాలో ఇటీవల కలకాలం రేపిన సీఐ ల ఫై మహిళల ఫిర్యాదులు… మరువకముందే గుంటూరు జిల్లాలో మరో మహిళ ఫిర్యాదు…
కుటుంబ సమస్యల కారణం గా పిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన మహిళను ట్రాప్ చేసి లోబర్చుకున్నారని సీఐ ఫై మహిళ పిర్యాదు…
బట్టబయలైన సిఐ రాములు నాయక్ లీలలు …
సిఐ రాములు నాయక్ తనను మోసం చేసి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోటా అరుణ కుమారి అనే మహిళ గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి సిఐ పై ఫిర్యాదు…
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
సీఐ రాములు నాయక్ తనను మోసగించి వివాహం చేసుకున్నారని ఆరోపణ.
తన మొదటి భర్తతో విభేదాల సమయంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనను అప్పటి ఎస్ఐ రాములు నాయక్ ట్రాప్ చేశాడని బాధిత మహిళ ఆరోపణ.
తనను శ్రీశైలంలో వివాహం చేసుకుని, ఇప్పుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని బాధితురాలి ఆరోపణ.
తనకు ప్రాణహాని ఉందని, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడన్న బాధితురాలు.
సీఐ రాములు నాయక్‌పై తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ..
ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి డిమాండ్.
న్యాయం కోసం ఐజీని కలిసేందుకు వెళ్లినా, అవకాశం కల్పించలేదని బాధిత మహిళ ఆవేదన.
పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు ఆవేదన…
తెనాలి సీఐగా ఉన్న సమయంలో రౌడీషీటర్లకు నడిరోడ్డుపై అరికాళ్లకు కోటింగ్ ఇచ్చిన ఘటనతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన రాములు నాయక్…

స్టేషన్ కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులను మోసగించి వశపరచుకోవటం, లైంగిక వేధింపులు చేయటం తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్…
