రైల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి ఇలా!

భారత్ న్యూస్ విజయవాడ…రైల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి ఇలా!

భారతీయ రైల్వే ప్రయాణికులకు IRCTC ఒక శుభవార్తను అందించింది.

ఇకపై వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టిక్కెట్ ఉన్నా చింతించాల్సిన అవసరం లేదు.

IRCTC యాప్‌లోని ‘చార్ట్స్/వేకెన్సీ’ ఆప్షన్ ద్వారా రైలులో ఖాళీగా ఉన్న సీట్లను మొబైల్‌లోనే నిమిషాల్లో తెలుసుకోవచ్చు.

రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత లేదా కదులుతున్న రైలులో ఖాళీ బెర్త్‌ను కనుగొనడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

ఆకుపచ్చ రంగులో కనిపించే సీట్లు ఖాళీగా ఉన్నాయని సూచిస్తాయి. ఖాళీ సీటు కనిపిస్తే, TTEని సంప్రదించి, నిర్దేశించిన ఛార్జీ చెల్లించి దానిని పొందవచ్చు.