మావోయిస్టులే నయం.. డ్రగ్స్ పెడ్లర్స్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కామెంట్స్

భారత్ న్యూస్ కరీంనగర్ …..మావోయిస్టులే నయం.. డ్రగ్స్ పెడ్లర్స్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కామెంట్స్

తెలంగాణ :

డ్రగ్ పెడ్లర్స్ కంటే మావోయిస్టులే నయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.

గతంలో మావోయిస్టులు గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని, ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి రవాణా విస్తరించిందని తెలిపారు.

మంగళవారం ఖమ్మంలో క్రైమ్ రివ్యూ నిర్వహించిన ఆయన, నట్టింట్లోకి, స్కూళ్ల దగ్గర చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడే డ్రగ్స్​ను అరికట్టకుంటే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని, గంజాయి నిర్మూలనకు అందరం కలిసి యుద్దం చేద్దామని పిలుపునిచ్చారు.