భారత్ న్యూస్ విజయవాడ…రైల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి ఇలా!
భారతీయ రైల్వే ప్రయాణికులకు IRCTC ఒక శుభవార్తను అందించింది.
ఇకపై వెయిటింగ్ లిస్ట్ లేదా RAC టిక్కెట్ ఉన్నా చింతించాల్సిన అవసరం లేదు.
IRCTC యాప్‌లోని ‘చార్ట్స్/వేకెన్సీ’ ఆప్షన్ ద్వారా రైలులో ఖాళీగా ఉన్న సీట్లను మొబైల్లోనే నిమిషాల్లో తెలుసుకోవచ్చు.
రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత లేదా కదులుతున్న రైలులో ఖాళీ బెర్త్‌ను కనుగొనడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

ఆకుపచ్చ రంగులో కనిపించే సీట్లు ఖాళీగా ఉన్నాయని సూచిస్తాయి. ఖాళీ సీటు కనిపిస్తే, TTEని సంప్రదించి, నిర్దేశించిన ఛార్జీ చెల్లించి దానిని పొందవచ్చు.