భారత్ న్యూస్ హైదరాబాద్ …45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
రైలు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు ‘ప్రయాణ బీమా’ బాక్స్‌ను చాలామంది పట్టించుకోరు.
కానీ, కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల వరకు రక్షణ కల్పించే ‘ఎంబెడెడ్ ఇన్సూరెన్స్’ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఈ విధానం ద్వారా వినియోగదారులు సులభంగా, తక్కువ ధరకే బీమా పొందవచ్చు. గతంలో సుదీర్ఘ ప్రక్రియగా ఉన్న బీమా కొనుగోలు, ఇప్పుడు సాంకేతిక అనుసంధానం వల్ల ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచ్చింది.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు కూడా ఈ తరహా బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది ఆటోమేటిక్ లేదా ఐచ్ఛిక ఎంపికగా లభిస్తుంది.