హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10% పెంపు

భారత్ న్యూస్ గుంటూరు…హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10% పెంపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతమిస్తున్న ఛార్జీలపై 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.