NEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌లోనే పరీక్షలు

భారత్ న్యూస్ రాజమండ్రి…NEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌లోనే పరీక్షలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (NEET-UG)ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 500 నగరాల్లోని 1,000 పరీక్షా కేంద్రాల్లో ఐదు నుంచి ఆరు రోజుల పాటు దశలవారీగా నిర్వహించబడుతుంది.

ప్రతి రోజు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో NTAలోనూ భారీ సంస్కరణలు చేపట్టనున్నారు.

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.