మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అస్సాం జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఐఈడీ బాంబు దాడి చేశారు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఉగ్రవాదుల దాడి… ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అస్సాం జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఐఈడీ బాంబు దాడి చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

మణిపూర్ సీఎం యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఈ దాడిని ఖండించి, బాధ్యులను చట్ట ప్రకారం శిక్షిస్తామని ప్రకటించారు.