విద్యుత్ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..విద్యుత్ వినియోగదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్

తెలంగాణలో భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు

ట్రూ–అప్ పేరిట వినియోగదారుల నుండి రూ.5,420.23 కోట్లు వసూలు చేయనున్న ప్రభుత్వం

నవంబర్ నుండి వసూళ్ల పర్వం మొదలు

కరెంటు బిల్లులో యూనిట్‌కు అదనంగా 30 నుండి 50 పైసలు వసూలు

విద్యుత్ వినియోగదారుల నుండి రూ.5,420.23 కోట్లు వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈఆర్‌సీ

ట్రూ–అప్ పేరిట వసూళ్లు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ 2025 నవంబర్ 10వ తేదీన ఈఆర్‌సీని కోరిన రెండు డిస్కంలు

ఈ నేపథ్యంలో టీజీఎస్‌పీడీసీఎల్‌కు 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌కు 26 నెలలు వసూలు చేసేందుకు ఈఆర్‌సీ అనుమతి

నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు, తర్వాత నుండి యూనిట్‌కు 50 పైసలు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు