బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలి: కవిత

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్.బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలి: కవిత

T.G : బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న అధిక పనిభారాన్ని తగ్గించేందుకు వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత కేంద్రాన్ని కోరారు.

రోజువారీ కస్టమర్ సేవలు, బ్యాక్ ఎండ్ పనులు, టార్గెట్లు, కరెన్సీ లెక్కలతో ఉద్యోగుల పరిస్థితి తీవ్ర సవాలుగా మారిందని ఆమె పేర్కొన్నారు. యూపీఐ, డిజిటల్ లావాదేవీలు పెరిగినా పనిభారం తగ్గలేదని, ఈ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కవిత విజ్ఞప్తి చేశారు.