భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..బస్ టికెట్‌తో పాటే ఇంటికి ఆటో.. టీజీఆర్టీసీ సరికొత్త సదుపాయం!
Jul 15, 2026,
బస్ టికెట్‌తో పాటే ఇంటికి ఆటో.. టీజీఆర్టీసీ సరికొత్త సదుపాయం!
తెలంగాణ : ప్రైవేటు ట్రావెల్స్ పోటీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌లో ‘కాంబో’ ఈ-ఆటో సర్వీసును ప్రవేశపెట్టనుంది. ఆర్టీసీ ప్రత్యేక యాప్ ద్వారా బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే, ఇంటి నుండి బస్టాండుకు లేదా బస్టాండు నుండి ఇంటికి వెళ్లేందుకు ఎలక్ట్రిక్ ఆటోను కూడా కలిపి బుక్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ కాంబో సర్వీసు ద్వారా బస్ టికెట్, ఆటో ఛార్జీ రెండూ కలిపి ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలు హైదరాబాద్ సిటీలో అందుబాటులోకి రానున్నాయి.

