కూకట్‌పల్లి లులు మాల్‌లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కూకట్‌పల్లి లులు మాల్‌లో కొనుగోలు చేసిన కిట్‌క్యాట్ చాక్లెట్‌లో పురుగులు కనిపించినట్లు ఓ కస్టమర్ ఫిర్యాదు చేశారు. పిల్లల కోసం కొన్న చాక్లెట్‌లో పురుగులు కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కంపెనీ, లులు మాల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.