కారుపై కూర్చొని బీర్ తాగుతూ యువతి హల్ చల్…

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కారుపై కూర్చొని బీర్ తాగుతూ యువతి హల్ చల్…

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో ఓ యువతి హల్చల్ చేసింది. కదులుతున్న కారుపై కూర్చొని ఆమె బీరు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బహిరంగ మద్యపాన నిషేధం అమలులో ఉన్నా నడిరోడ్డుపై యువతి ప్రవర్తించిన తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు….