కోయంబత్తూరు బాంబు పేలుళ్ల దోషులకు 60 రోజుల పెరోల్.. విజయ్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కోయంబత్తూరు బాంబు పేలుళ్ల దోషులకు 60 రోజుల పెరోల్.. విజయ్ ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

1998 కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఐదుగురు దోషులకు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం 60 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ దాడిలో 58 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా గాయపడ్డారు.

నిషేధిత అల్‌ ఉమ్మా సంస్థతో సంబంధాలున్న ఈ ఐదుగురు.. బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ ఎన్నికల ర్యాలీకి ముందు జరిగిన పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. వ్యక్తిగత, వైద్య కారణాలతో పెరోల్ ఇచ్చినట్లు అధికారులు చెబుతుండగా.. 30 ఏళ్లుగా జైల్లో ఉన్నందున వారికి ఉపశమనం కల్పించామని టీవీకే ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

పెరోల్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమే దోషులకు ఉపశమనం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే పెరోల్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. జైలు నిబంధనల ప్రకారమే తాత్కాలిక విడుదల చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.