భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..వరంగల్‌లో భారీగా కల్తీ కారం, పసుపు పొడి పట్టివేత.. 2,250 కిలోలు స్వాధీనం!
వరంగల్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై అధికారులు కొరడా ఝళిపించారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా కల్తీ కారం, పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2,250 కిలోల కల్తీ కారం, పసుపు పొడిని అధికారులు పట్టుకోగా, వీటి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు.

ఎలాంటి లైసెన్స్, లేబుల్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో పొడులను ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారులపై అధికారులు చర్యలు చేపట్టారు.