బెజవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ.

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బెజవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ.. లక్షా 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో చారిత్రాత్మక విజయం!

విజయవాడ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. జనసేన జెండా రెపరెపలు!

వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై 1,30,872 ఓట్ల ఆధిక్యం

కూటమి ఐక్యతకు ప్రజల పట్టం..

బెజవాడలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం

విజయవాడ: బెజవాడ నగర రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

ఓట్ల లెక్కింపులో మొదటి నుంచే ఆధిపత్యం ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచే వంగవీటి రాధాకృష్ణ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ పెరుగుతూ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు.
తుది ఫలితాల్లో వంగవీటి రాధాకృష్ణకు 2,65,888 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు వచ్చాయి.