సింగరేణి కార్మికుల ఖాతాల్లో దీపావళి బోనస్ జమ

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సింగరేణి కార్మికుల ఖాతాల్లో దీపావళి బోనస్ జమ

దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

దేశ ఇంధన, పారిశ్రామిక అవసరాలలో కీలక పాత్ర పోషిస్తున్న 38 వేల మంది కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ లింక్డ్ రివార్డు బోనస్ అందించారు.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఒక్కో కార్మికుడి ఖాతాలో గరిష్ఠంగా రూ. 1,10,250 బోనస్‌గా జమ చేయబడింది.