ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ భారీగా నగదు పట్టివేత

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చెలరేగింది.

పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ. 42.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఆ డబ్బులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపని కారణంగా అధికారులు దానిని సీజ్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ నగదు మూలాల గురించి విచారణ కొనసాగుతోంది.