భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..NTR వైద్యసేవ’కు రూ.1,000 కోట్లు విడుదల

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు, నెట్‌వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులతో ఆసుపత్రులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత, రాయితీ వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
