భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..హనుమాన్ విగ్రహం పున:ప్రతిష్ఠ
తిరుమల ఘాట్రోడ్డులో అపహరణకు గురైన అభయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని 15 గంటల్లోనే పోలీసులు రికవరీ చేసిన విషయం తెలిసిందే. విగ్రహాన్ని తిరుపతికి తీసుకొచ్చి TTDకి అప్పగించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు భక్తుల సమక్షంలో యథాస్థానంలో పునః ప్రతిష్ఠించారు. నడక మార్గంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు..

