పేపర్‌ లీక్‌లపై కేంద్రం కఠిన నిర్ణయం.. 10 ఏళ్ల జైలు, రూ.కోటి జరిమానా…

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..పేపర్‌ లీక్‌లపై కేంద్రం కఠిన నిర్ణయం.. 10 ఏళ్ల జైలు, రూ.కోటి జరిమానా…

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పోటీ పరీక్షల పేపర్‌ లీక్‌లను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అమల్లో ఉన్న చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం పేపర్‌ లీక్‌కు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షల పారదర్శకతను కాపాడడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది….