ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈసారి దసరా సెలవులకు ముందు రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో 10వ తేదీ నుంచే బడులకు సెలవులు మొదలు కానున్నాయి. 22న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.