భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..తొలిసారి జలప్రవేశం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్
విశాఖపట్నం :
విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్లో మంగళవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను జలప్రవేశం చేయించారు.ఈ సందర్భంగా FSS-5కు శంకుస్థాపనతో పాటు భారీ గోలియత్ క్రేన్, స్లిప్త్వో-4ను కూడా ఆయన ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేవీ చీఫ్ కూడా పాల్గొన్నారు. 43,500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ నౌకలు భారత నావికాదళానికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి, ఇవి యుద్ధనౌకలకు నడిసంద్రంలో ఇంధనాన్ని అందించగలవు….
