భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చార్ట్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్లు
భారతీయ రైల్వే ప్రయాణికులకు కరెంట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్త్‌లను ఈ సౌకర్యం ద్వారా బుక్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారికి, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. కరెంట్ బుకింగ్ ద్వారా కన్ఫర్మ్ టికెట్లు మాత్రమే జారీ అవుతాయి. అయితే, సీట్ల లభ్యత పూర్తిగా ఖాళీ సీట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణానికి ముందు సీట్ల లభ్యతను తనిఖీ చేసుకోవడం మంచిది.
