భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కూలిపని చేసుకునే తండ్రి కొడుకు, కేవలం 87 వేల రూపాయలతో అగ్రరాజ్యాలకు సైతం సాధ్యంకాని అద్భుతాన్ని ఎలా సృష్టించాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! 🇮🇳🔥
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఐదో సెమిస్టర్ చదువుతున్న సర్వేష్ శర్మ అనే సాధారణ విద్యార్థి సృష్టించిన సంచలనం ఇది. ఏ దేశపు రాడార్లకు కూడా చిక్కకుండా తప్పించుకు తిరిగే ఒక అత్యాధునిక సైనిక డ్రోన్ [Army Drone] ను ఈ కుర్రాడు సొంతంగా తయారు చేశాడు. దానికి ‘రుద్ర ఎడ్జ్ వన్ స్పెక్ట్రా’ అని పేరు కూడా పెట్టాడు.
ఒక రోజు కూలీ కొడుకుగా పుట్టి, రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కకుండా తన తెలివితేటలతో ఏకంగా దేశ రక్షణ కోసం ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కేవలం 87 వేల రూపాయల ఖర్చుతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి చూపించినందుకు గానూ, ఇండియన్ ఆర్మీ ఆశ్చర్యపోయి ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల బహుమతితో [Reward] అతన్ని సత్కరించి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ కుర్రాడిని సన్మానించింది.
పనికిమాలిన విషయాలను రోజంతా చూపిస్తూ టైం వేస్ట్ చేసే మీడియా ఉన్న ఈ రోజుల్లో… దేశం గర్వించదగ్గ ఇలాంటి నిజమైన యువత [Real Gen Z] సాధించిన విజయాలను అందరికీ తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనదే కదా?

ఒక సామాన్య పేద కుటుంబం నుండి వచ్చి దేశానికి వెన్నెముకగా నిలిచిన ఈ కుర్రాడి అద్భుతమైన టాలెంట్ పై మీరేమనుకుంటున్నారు…