భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..2029 నాటికి 4 లాంచ్ ప్యాడ్లు: ఇస్రో చైర్మన్
పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా 2029 నాటికి నాలుగు లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. తమిళనాడు కులశేఖరపట్నంలో SSLV ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో గగన్ యాన్ పరీక్షలు, జపాన్‌తో కలిసి ‘చంద్రయాన్-5’ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇస్రో జాతీయ సంస్థగానే కొనసాగుతుందని, ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
