భారత్ డిజిటల్ న్యూస్ భక్తి॥ శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ॥
🦚🌹🦢🙏🦢🌹🦚
చరాచరాత్మా సూక్ష్మాత్మా
అమృతో గోవృషేశ్వరః।
సాధ్యర్షి ర్వసురాదిత్యో
వివస్వాన్ సవితామృతః॥
శ్లోకార్థం:
చరాచరాత్మా
చరము, అచరము
కదిలేవి, కదలనివి
అన్నిటి ఆత్మ ఆయనే!
సూక్ష్మాత్మా
అతి సూక్ష్మమైన ఆత్మ
కంటికి కనపడని ఆత్మ!

అమృతః
అమృత స్వరూపుడు
మరణం లేనివాడు!
గోవృషేశ్వరః
గోవుకు, వృషభానికి ఈశ్వరుడు
అంటే అందరికీ ఈశ్వరుడు!
సాధ్యర్షి ర్వసురాదిత్యో
సాధ్యులు, ఋషులు, వసువులు, ఆదిత్యులు,
వివస్వాన్ సవితామృతః
వివస్వంతుడు, సవిత
అన్నీ ఆయనే
అమృతం ఆయనే!
శ్లోక భావార్థం:
కదిలేవి – మనుషులు, జంతువులు, పక్షులు!
కదలనివి – చెట్లు, కొండలు, రాళ్లు!
వాటి అన్నిటి ఆత్మ శివుడే!
అంటే? ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి అణువులోనూ శివుడే ఉన్నాడు!
మీలోనూ నాలోను ప్రతి జీవిలోనూ ప్రతి అణువులోనూ ధూళిలోనూ ఉన్నదంతా శివుడే
మృత్యువును ప్రసాదించినా అమృతాన్ని ప్రసాదించినా అంతా ఈశ్వర సంకల్పమే!
మనకు కనపడని మనలో ఉన్న సూక్ష్మమైన ఆత్మను తెలుసుకున్నప్పుడే “నీవూ” శివుడు కాగలవు.
ఈరోజు సోమవారం:
ఓం చరాచరాత్మనే నమః
ఓం సూక్ష్మాత్మనే నమః
అని 21 సార్లు జపించండి.
శివానుగ్రహానికి పాత్రులు కండి!
🪷మిత్రులకు,ఇందువాసర శుభోదయం.🪷