ఛత్తీస్‌గఢ్‌లో 4 కోట్ల హవాలా నగదు పట్టివేత

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఛత్తీస్‌గఢ్‌లో 4 కోట్ల హవాలా నగదు పట్టివేత

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్-3 చరోడా ప్రాంతంలో పికప్ వాహనంలో తరలిస్తున్న రూ.4 కోట్ల నగదును దుర్గ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అభన్‌పూర్ నుంచి భారీగా నగదు పికప్‌లో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కుమ్హారి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులను చూసి వాహనం ఆపకుండా వెళ్లడంతో వెంబడించి చరోడా సమీపంలో పట్టుకున్నారు.

పికప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య ఛాంబర్‌లో నగదును దాచినట్లు గుర్తించారు. రాయ్‌పూర్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు నగదు తరలిస్తున్నట్లు సమాచారం. కేసును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించగా, దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.