నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ,

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ,

ఏలూరు జిల్లా: చింతలపూడి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చింతలపూడి మండల పరిషత్ కార్యాలయాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ, పరిశీలించారు.
ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, చింతలపూడి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న నామినేషన్ కేంద్రాన్ని వారు సందర్శించారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా విధుల్లో పాల్గొనే సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. వారి వెంట చింతలపూడి సబ్ ఇన్స్పెక్టర్, సతీష్ కుమార్ మరియు సిబ్బంది ఉన్నారు.