12 మందిని కాపాడిన భారత్.. థ్యాంక్యూ చెప్పిన చైనా

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..12 మందిని కాపాడిన భారత్.. థ్యాంక్యూ చెప్పిన చైనా

భారత నౌకాదళంపై చైనా ప్రశంసలు కురిపించింది. భారత్‌లో తాజాగా నియమితులైన చైనా రక్షణ ప్రతినిధి అడ్మిరల్ యూ జియాన్, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ వార్షికోత్సవ సందర్భంగా మాట్లాడుతూ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది కేరళ తీరంలో అగ్నిప్రమాదానికి గురైన కార్గో నౌక నుంచి 12 మంది చైనా పౌరులను భారత నౌకాదళం సురక్షితంగా రక్షించిన ఘటనను తాము ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు. భారత్‌తో రక్షణ, సైనిక, దౌత్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.