భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.బియ్యం ధరల తగ్గింపు.. ఆగస్టు 1 నుంచి విక్రయాలు: నాదెండ్ల…..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 500 రైస్ మిల్లుల అవుట్లెట్లు, 130 రైతు బజార్లలో స్టాల్స్ ద్వారా సూపర్ ఫైన్ స్టీమ్ రైస్‌ను రూ. 52కు, బీపీటీ గ్రేడ్-1ను రూ. 50కు, గ్రేడ్-2ను రూ. 48కు విక్రయిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ కేజీ రూ.62-65, బీపీటీ గ్రేడ్-1 రూ.55-58, గ్రేడ్-2 రూ.48గా విక్రయిస్తున్నారు….

