AIIMS బీబీనగర్: ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పు

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..AIIMS బీబీనగర్: ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పు

తెలంగాణ : యాదాద్రి జిల్లా AIIMS బీబీనగర్‌లో ఆగస్టు 1, 2026 నుండి అవుట్ పేషెంట్ విభాగం (OPD) రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, శనివారం ఉదయం 8:00 నుండి 10:30 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ వంటి ప్రత్యేక విభాగాల పనివేళల్లో కూడా మార్పులున్నాయి.

ఆసుపత్రికి వెళ్లే ముందు ఈ కొత్త సమయాలను చూసుకోవాలని సూచించారు.