ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఒకే ఇంట్లో ఆరుగురికి తల్లికి వందనం

కుందుర్పి (అనంతపురం): అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన.. వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో ఆరుగురికీ కలిపి రూ.78 వేల నగదు జమ అయింది.

పెద్ద అమ్మాయి పుష్పావతి ఇంటర్ ఫస్టియర్ కాగా, అఖిల, కవిత, వాణి, నవిక, పరమేశ్వర్ కుందుర్పి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.

తల్లిదండ్రులు రాళ్లు కొట్టే పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నగదు జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లలకు వారు కృతజ్ఞతలు తెలిపారు…