భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తల్లికి వందనం సాయంపై హర్షాతిరేకాలు
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడిన టీడీపీ నేతలు
సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
అవనిగడ్డ: తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కావడం పట్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు .బుధవారం అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల చదువులకు ప్రాధాన్యత ఇస్తూ ‘తల్లికి వందనం’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ తిరుగుతూ, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చదువుల నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూళ్లు తెరిచే సమయంలోనే డబ్బులు జమ కావడం పిల్లల పుస్తకాలు, యూనిఫామ్‌లు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి సాయం అందించినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు చదువుకోవడానికి కావాల్సిన సామగ్రి కొనుక్కోవడానికి ఈ సాయం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా అమ్మ ఖాతాలో డబ్బులు పడటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు చదువే ఏకైక మార్గమని నమ్మిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు,బండే శ్రీనివాసరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లకనం నాగాంజనేయులు ,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి ఇమ్మానియేలు, మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు,క్లస్టర్ ఇంచార్జిలు బండే రాఘవ,అప్పికట్ల రవీంద్ర,విశ్వనాథపల్లి పీఏసీఎస్ చైర్మన్ తోట సాంబశివరావు,పార్టీ నాయకులు ఉప్పల ప్రసాద్,షేక్ బాబావలి,కొండవీటి గోవిందు,ముళ్లపూడి శ్రీనివాసరావు,చందన రంగారావు,దిడ్ల జానకీ రాంబాబు,నాగిడి రాంబాబు,సనకా సురేష్,మీసాల శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

