భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…పీసీఐ కేంద్ర మండలి సభ్యుడిగా డాక్టర్ నరేంద్ర నియామకం
ఘంటసాల మండలం కొత్తపల్లికి చెందిన దివంగత దేవన బోయిన నాగయ్య కుమారుడు డాక్టర్ డి. నరేంద్ర భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ )కేంద్ర మండలి సభ్యుడిగా నియమితులయ్యారు.
ఇటీవల డిల్లీలో పీసీఐ అధ్యక్షుడు ఎం.ఎం.పటేల్ నుంచి డాక్టర్ నరేంద్ర నియామక పత్రాన్ని అందుకున్నట్లు పేర్కొన్నారు.

రాజమండ్రిలో దివాన్ చెరువులోని వీజే ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ నరేంద్ర బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇప్పటివరకు డాక్టర్ నరేంద్ర అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా (ఏపీటీఐ) కార్యదర్శిగా విధులను నిర్వర్తిస్తున్నారు.
డాక్టర్ నరేంద్రను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, పలువురు ప్రముఖులు అభినందించారు.
