సీఐ నాగరాజు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..సీఐ నాగరాజు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

AP: కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు సీఐ నాగరాజుకు జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వులపై ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది.