ఆషాఢంలో – అమ్మ వారాహీ…………..!!ఈ నవరోజుల్లో..అమ్మ వారాహి స్తోత్రం..పఠించండి.!

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..ఆషాఢంలో – అమ్మ వారాహీ…………..!!
ఈ నవరోజుల్లో..అమ్మ వారాహి స్తోత్రం..పఠించండి.!

ఆషాఢ శధ్ధ పాడ్యమి నుండీ వారాహీ నవరాత్రలు ప్రారంభం!

నవరాత్రులూ అనగానే మనకి ముందుగా ఆశ్వీయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు తలంపునకు వస్తాయి!

అలాగే చైత్ర మాసం లో వచ్చే వసంత నవరాత్రులు కూడ మనకి పరిచయమే!

ఈ రెండూ కాక మరో రెండు నవరాత్రులు వున్నాయి.వాటి గురించి చిన్న వివరణ.

1 చైత్రమాసమున వసంత నవరాత్రములు
2 ఆషాఢమున వారాహీ నవరాత్రులు
3 ఆశ్వీజమున శరన్నవరాత్రులు దుర్గాదేవి
4.మాఘమాసమున శ్యామలదేవి నవరాత్రులు.

అంటే నాలుగు ఋతువులలో —
వసంత, గ్రీష్మ ; శరత్; శిశిర ఋతువులలో నివి.వస్తాయి.

చైత్ర మాసమున అర్చింపబడుదేవి అనగా లలిత, శ్రీ రాజరాజేశ్వరీ దేవతలు.

ఆశ్వీజమాసమున అర్చింపబడు దుర్గా దేవి అర్చనలు మనకు సుపరిచితములు.

కానీ ఆషాఢ ,మాఘ మాసములందు అర్చింపబడు వారాహీ , శ్యామలా దేవతలు మనకు లలిత; దుర్గా దేవతలవలే అంతగా తెలిసిన వారు కాదు.పరిచయం తక్కువ!

జగన్మాతయైన పరాశక్తి హృదయమునుండి..మాతృకా రూపిణి అయిన బాలా త్రిపుర సుందరీ దేవి,
ఆదిపరాశక్తి బుధ్ధి నుండీ..చిలుకనూ, వీణను ధరించిన శ్యామలాదేవి
అమ్మ అహంకారమునుండీ..మహావారాహీ జన్మించిరి.
వీరును దేవీరూపాంతరములేకానీ వేరుగా మరొకరు కాదు.

శ్యామలా దేవి మహామంత్రిణి! శక్తి సామ్రాజ్యమునకు !!

దేవీ సేనకు ప్రధాన అధికారిణి వారాహీ!!
“విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్యనందితా!”
(లలితా సహస్రలో చదుతాం )విశుక్రుడనే రాక్షసుడిని సంహరించినది.
అమ్మవారి సేనకు ప్రధాన సైన్యాధ్యుక్షురాలు ఈమె.వారాహీ దేవి.సప్తమాతృకలలో ఒకరు.అలాగే దశమహా విద్యలలో కూడ ఈమె కొలుస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి.లక్ష్మీ స్వరూపంగాకూడ కొలుస్తారు.

వారాహీ పూజనూ సూర్యోదయానికి ముందు..
సూర్యాస్తమయానికి తరువాత చేయాలి.
దేవి పూజ రాత్రి సమయం ప్రశస్తమైనది.
ఇదీ సాంప్రదాయికంగా శ్రీవిద్యాదీక్షాపరులు మాత్రమే చేయతగినది!
అమ్మవారు సాంప్రదాయిని! సంప్రదాయేశ్వరీ!సదాచారప్రవర్తిక!!అందువలన..
నిర్మల మైన మనస్సుతో.స్వచ్ఛంగా నమస్కరించి వేడుకున్నా ఆ తల్లి అనుగ్రహిస్తుంది!.స్వస్తి..!!