కృష్ణ డెల్టాకు ఊపిరి పోసేందుకు ఉరకలెత్తుతూ పవిత్ర సంగమానికి వస్తున్న గోదావరి జలాలు.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి.

కృష్ణ డెల్టాకు ఊపిరి పోసేందుకు ఉరకలెత్తుతూ పవిత్ర సంగమానికి వస్తున్న గోదావరి జలాలు.

కృష్ణాకు తీవ్ర కరువు పరిస్థితుల్లో వరం లా మారిన పట్టిసీమ.

రేపు ఉదయానికి, కృష్ణానది పవిత్ర సంగమానికి చేరుకోనున్న గోదావరి జలాలు.

ఈ మూడు రోజుల్లో పట్టిసీమ ద్వారా 1.33 టిఎంసిల గోదావరి జలాలు కృష్ణాకు తరలింపు.

గోదావరిలో కొనసాగుతున్న వరద ఉదృతి.

పోలవరం స్పిల్వే దగ్గర ఈరోజు సాయంత్రానికి 27.550 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం.

పోలవరం స్పిల్వే నుండి లక్షా ఏడువేల 800 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల.

పట్టిసీమ దగ్గర 15.6 మీటర్లు ఉన్న గోదావరి నీటి మట్టం.

పట్టిసీమ పంప్ హౌస్ లో 20 మోటార్లు ఆన్ చేసి 7,080 క్యూసెక్కులు తరలిస్తున్న అధికారులు.

పట్టిసీమ పంప్ హౌస్ మొదలైన నాటి నుండి నేటి వరకు రికార్డు స్దాయిలో 443.7 టిఎంసిల గోదావరి జలాలు కృష్ణాకు తరలింపు.