భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఆశలన్నీ కర్ణాటక జలాశయాల పైనే
- కృష్ణా బేసిన్‌లో ఆలస్యంగా ప్రారంభమైన వరదలు
- కర్ణాటక జలాశయాలపైనే తెలుగు రాష్ట్రాల ఖరీఫ్ ఆశలు
- మహారాష్ట్ర లో భారీగా కురుస్తున్న వర్షాలు
- అల్మటి డ్యాంకు భారీగ వరద రాక
- నిరాశపరిచిన జూన్.. జూలై, ఆగస్టు పైనే ఆశలు
- ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే జూరాల, శ్రీశైలం, సాగర్‌కు వరద
తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి భవితవ్యానికి కీలకమైన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎట్టకేలకు వరద కదలికలు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు ఎదురై, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా కృష్ణా ప్రాజెక్టులు వెలవెలబోయాయి. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు, గుంటూరు జిల్లాల రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే, గత వారం రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పుడు అన్నదాతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

