భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఏపీలోని పంచాయతీల్లో ఉద్యోగులకు గుడ్ న్యూస్
అమరావతి :
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలోని పంచాయతీల్లో పట్టణాల తరహా సౌకర్యాలు కల్పించేందుకు ‘రూర్బన్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. పదివేల మందికిపైగా జనాభా లేదా రూ. కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ గా ఎంపిక చేశారు. ఈ పంచాయతీల్లో కొత్తగా జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేసి, పే స్కేల్ మార్చారు. అలాగే, డిప్యూటీ ఎంపీడీవో, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారిగా గెజిటెడ్ హోదా కల్పించారు. రాష్ట్రం మొత్తం 359 రూర్బన్ పంచాయతీలను ఎంపిక చేశారు.

