తెల్లవారుజామున 4.5 తీవ్రతతో విశాఖలో భూకంపం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..తెల్లవారుజామున 4.5 తీవ్రతతో విశాఖలో భూకంపం

విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 5.05 గంటలకు భూమి కంపించినట్టు సమాచారం.

దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది.

కాకినాడకు 227 కి.మీ దూరంలో బంగాళాఖాతంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు….