ఢిల్లీలో శ్రీ వినాయక మందిరంలో పూజలు చేసిన ప్రధాని మోదీ

భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….ఢిల్లీలో శ్రీ వినాయక మందిరంలో పూజలు చేసిన ప్రధాని మోదీ

Oct 07, 2026,

దేశ ప్రధాన పాలసీమేకర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని శ్రీ వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం కోసం గణేశుడిని ప్రార్థించినట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. 2001 అక్టోబర్ 7న సీఎంగా ప్రస్థానం మొదలుపెట్టిన మోదీ పాతికేళ్ల మైలురాయిని పురస్కరించుకుని బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ చేపట్టింది. ఈ సందర్భంగా కేబినెట్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది.