భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……మురసు తుపాను ప్రభావంతో రానున్న మూడురోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు; కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
▫️రేపు మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80-90కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరందాటే సమయంలో గంటకు 100 నుండి 110 కి.మీ వరకు గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
◾ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
