భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫామ్ 7 అక్రమాలపై విచారణ జరిపించాలి.
కుట్రదారులను కఠినంగా శిక్షించాలి.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ, ఇడి, ఐటి వంటి సంస్థలను భ్రష్టు పట్టించింది. తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించి వాటి విశ్వసనీయతను దెబ్బ తీసింది. రాజకీయాలకు అతీతంగా, స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన భారత ఎలక్షన్ కమిషన్ బిజెపి ప్రభుత్వ వింగ్ లాగా మారింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలి తోటి కమిషనర్ల అభిప్రాయాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం అందుకు పరాకాష్ట.
ఇప్పటికే దేశంలో ఎస్.ఐ.ఆర్. పేరుతో సుమారు 13 కోట్ల 30 లక్షల ఓటర్లను ఎన్నికల కమిషన్ తొలగించింది. దానికితోడు బిజెపికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు బిజెపికి ఓటు వేయని వారిని గుర్తించి ఫామ్ 7 ద్వారా వారి ఓట్లు తొలగించాలని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మైనార్టీలు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన 30 మంది పేర్లను ఓట్ల జాబితా నుండి తొలగించేందుకు బిజెపి బిఎన్ఏ ముందే ముద్రించిన ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. గోషామహల్, బహదూరు్పుర నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది.
ఫామ్ 7 ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఓటరు పేరును తొలగించాలని కోరడానికి ఉపయోగిస్తారు. బిజెపి బిఎల్ఏ లకు ఈ ప్రింటెడ్ దరఖాస్తులను ఎవరు అందించారు. అందులో పేర్కొన్న ఓటర్ల వివరాలు ఎక్కడి నుండి వాళ్లకు వచ్చాయి. ఫామ్-7 అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి కుట్రదారులను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కును కాపాడాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇసి జ్ఞానేష్ కుమార్ గత 10 నెలల్లో సహా కమిషనర్లు సుఖ్వేందర్ సింగ్ సందు, వివేక్ జోషిలు 14 సార్లు విభేదించినా సిఇసి జ్ఞానేశ్ కుమార్ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను వెంటనే ఆపాలని, ఫామ్ 7 ద్వారా తొలగించిన ఓటర్ల హక్కును పునరుద్ధరించాలని, ఓటర్ల డేటా కేంద్రీకరణ ఆపాలని, స్థానిక ERO లకు యాక్సెస్ ఇవ్వాలని సి.పి.ఎం. డిమాండ్ చేస్తున్నది.