భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ అంబులెన్స్’ సేవలు ప్రారంభం
విద్యుత్ అత్యవసర సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ అంబులెన్స్’ సేవలను బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
వైద్య అత్యవసరాల్లో 108 సేవలు అందించే తరహాలోనే ఈ సేవలు పనిచేస్తాయి.
తీగలు తెగిపడటం, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు వంటి ఆకస్మిక అంతరాయాలు ఏర్పడినప్పుడు ఈ ప్రత్యేక బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటుంది.

ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన ఈ సేవలను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
